
బాలీవుడ్లో ఒక టాప్ క్వీన్‌గా నిలిచిన ఈ అందాల భామ ఎక్కడ నటించినా అక్కడ హిట్ కొట్టిస్తుందనే నమ్మకం అక్కడి ప్రేక్షకుల్లోనూ బలంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుతో కలిసి వన్ నేనొక్కడినే సినిమాలో నటించి అదరగొట్టేసింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న టాక్ ప్రకారం, కృతి సనన్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోతున్న రంగస్థలం 2 సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుందట. ఈ వార్తపై చిత్రబృందం ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడంతో, అభిమానులు ఇది దాదాపు కన్ఫర్మ్ అయ్యిందనే భావనలో ఉన్నారు. అయితే, ఇదే సమయంలో మరో హీరోయిన్ పేరు కూడా ఈ ప్రాజెక్ట్‌కి జత కావడం గమనార్హం.
ఆ బ్యూటీ మరెవరో కాదు – ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రుక్మిణి వసంత్. కాంతార చాప్టర్ 1 సినిమా ట్రైలర్ లో ఎంత అందంగా కనిపించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టితో జంటగా కనిపించిన రుక్మిణి వసంత్, అద్భుతమైన నటనతో పాటు తన ట్రెడిషనల్ లుక్‌తో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. అలాంటి ఈ బ్యూటీ ఎన్టీఆర్ పక్కన కూడా పర్ఫెక్ట్ జోడీ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా, రుక్మిణి వసంత్ రామ్ చరణ్‌తో జోడీ కడితే కూడా బాగుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రకరకాల చర్చలు చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో మరో ట్రెండ్ కూడా నడుస్తోంది. కృతి సనన్‌కి బదులుగా రుక్మిణి వసంత్‌ని సుకుమార్ ఈ సినిమాలో తీసుకుంటే బాగుంటుందని, ముఖ్యంగా ఆమె ట్రెడిషనల్ లుక్ చాలా బాగా ఒదిగిపోతుందని అభిమానులు వాదనలు పెడుతున్నారు. దీంతో, "ఎన్టీఆర్ హీరోయిన్" అంటూ రుక్మిణి వసంత్‌పై తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఫ్యాన్స్ కామెంట్స్ విని సుకుమార్ తన నిర్ణయాన్ని మార్చి, కృతి సనన్ని కాకుండా రుక్మిణి వసంత్‌ని రంగస్థలం 2 కోసం ఎంపిక చేస్తే, అది మహేష్ బ్యూటీకి ఒకరకంగా పొగరు దించేసినట్లే అవుతుందని కొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు, రుక్మిణి వసంత్ కి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలతో నటించే ఛాన్స్ రావడం ఏ కొత్త హీరోయిన్‌కి అయినా కెరీర్లో మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. చూడాలి మరి – సుకుమార్ ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు? కృతి సనన్‌నే కొనసాగిస్తారా? లేక రుక్మిణి వసంత్ అనే కొత్త ప్రతిభకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఏ నిర్ణయం తీసుకున్నా, ఈ రంగస్థలం 2 సినిమా రిలీజ్‌కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది అన్నది మాత్రం ఫ్యాక్ట్.