టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. తారక్ కొంత కాలం క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. భారీ మల్టీ స్టారర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా తారక్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత నుండి తారక్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత తారక్ "దేవర పార్ట్ 1" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా తారక్ , హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే హిందీ సినిమాలో నటించాడు. ఈ సినిమా తాజాగా ఆగస్టు 14 వ విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. తారక్ మొదటి సారిగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో 250 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకున్నాడు.

మూవీ తర్వాత తారక్ నటించిన దేవర సినిమా కూడా 250 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా తారక్ నటించిన బార్ 2 సినిమా 250 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా వరుసగా మూడు సినిమాలతో తారక్ 250 కోట్ల కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టి సూపర్ సాలిడ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇకపోతే వార్ 2 మూవీ మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసే అవకాశం ఉంది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే లోపు ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: