ఇటీవల విడుదలైన ఈ నలుగురు కలయికలో వచ్చిన ఒక సాంగ్ విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ పాటలోని కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, ప్రభాస్ స్టైలిష్ లుక్, హీరోయిన్స్ గ్లామర్ అన్నీ కలిసి ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ఆయన స్టార్ పవర్‌ను గుర్తు చేశాయనే చెప్పాలి.ఇక ఇదిలా ఉండగా, ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో ఒక క్యూట్ అండ్ స్పెషల్ పిక్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలో ఆమె రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి కనిపిస్తూ, ఆ మూమెంట్‌ను నిజంగా ఒక బ్యూటిఫుల్ ఫోటో మూమెంట్ గా మార్చింది. ఈ పిక్‌లో ప్రభాస్, నిధి ఇద్దరూ కలిసి తమ వేళ్లతో ప్రసిద్ధమైన కొరియన్ లవ్ సింబల్ చూపిస్తూ ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నారు.
అయితే ఈ ఫోటోపై కొన్ని చోట్ల ఏఐ ద్వారా తయారై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవ్వడంతో, నిధి అగర్వాల్ స్వయంగా స్పందిస్తూ “ఇది ఏఐ పిక్ కాదు… పూర్తిగా ఒరిజినల్ ఫోటో” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఈ క్లారిఫికేషన్‌తో పాటు ఆ ఫోటోకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ చేసింది.దీంతో ఈ క్యూట్ పిక్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తూ, కామెంట్స్‌లో హార్ట్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలతో ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్–నిధి కెమిస్ట్రీ స్క్రీన్‌పై కూడా అదిరిపోతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో మరింత బలపడింది. మొత్తానికి ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతుండగా, ఇలాంటి వైరల్ ఫోటోలు, అప్డేట్స్ సినిమాపై క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. ప్రభాస్ నుంచి రాబోయే ఈ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి