ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తెలుగు దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ హీరోగా మగధీర అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి రాజమౌళి మాట్లాడుతూ ... చరణ్ తండ్రి అయినటువంటి చిరంజీవి ఓ సినిమాలో ఓ సన్నివేశం చేశాడు. అది నాకు అంతగా నచ్చలేదు. దానితో చరణ్ తో మగధీర సినిమాలో అలాంటి సన్నివేశాన్నే చిత్రకరించాను అని చెప్పుకొచ్చాడు. ఇంతకు ఆ సన్నివేశం ఏమిటి ..? అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఒకానొక సందర్భంలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి గారు కొదమ సింహం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమాలో చిరంజీవి పీకల్లోతు ఇసుకలో మునిగిపోయినప్పుడు అతన్ని ఎవరు కాపాడతారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయం లో అతని గుర్రం వచ్చి చిరంజీవి ని కాపాడుతుంది. దానితో ప్రేక్షకులు అంత ఆ సన్నివేశానికి ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత వెంటనే గుర్రం కి థాంక్యూ చెప్పే విధంగా ఈ సన్నివేశం కూడా ఉండదు. దానితో నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇక నేను చరణ్ తో చేసిన మగధీర సినిమాలో కూడా చరణ్ "కొదమ సింహం" సినిమాలో మాదిరి ఇసుకలో ఇరక్క పోతాడు. అలాంటి సమయంలో చరణ్ ను అతని గుర్రం కాపాడుతుంది. కానీ గుర్రం కాపాడిన తర్వాత చరణ్ దానికి థాంక్యూ చెప్పే విదంగా సన్నివేశాన్ని నేను డిజైన్ చేశాను. అలా కొదమ సింహం సినిమాలో చిరంజీవి చేసిన సీన్ నాకు నచ్చలేదు. దానితో చరణ్ తో చేసిన మగధీర సినిమాలో అలాంటి సన్నివేశాన్ని రూపొందించాను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇకపోతే చరణ్ , రాజమౌళి కాంబోలో రూపొందిన మగధీర మూవీ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: