
తాజాగా హీరో నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా 2025 చివర్లో లేదా 2026 ఆరంభంలో వచ్చే అవకాశం ఉందన్నారు. మోక్షజ్ఞ శారీరకంగా పూర్తిగా మారిపోయాడని, హీరోగా కనిపించే లుక్, స్టామినా ఇప్పుడు ఉన్నాయని రోహిత్ తెలిపారు. ఆయనతో ఇటీవలే మాట్లాడానని, ప్రస్తుతం సరైన కథ కోసం వెతుకుతున్నాడని రోహిత్ చెప్పడం నందమూరి అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. బాలకృష్ణ చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి, త్వరగానే అగ్ర హీరోగా ఎదిగారు. ఆ పంథాలోనే మోక్షజ్ఞ కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని అభిమానుల ఆశ. అయితే నందమూరి కుటుంబం ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన చేయకపోవడం ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. ఇప్పుడు రోహిత్ క్లారిటీ ఇవ్వడంతో వీరిలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.