బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే హిందీ సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సారా అలీ ఖాన్ , సైఫ్ అలీ ఖాన్ కూతురు అనే విషయం మన అందరికి తెలిసిందే.

తాజాగా సారా అలీ ఖాన్ కి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రెండవ హీరోయిన్గా తృప్తి డిమ్రి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. 

మూవీ లో తృప్తి డిమ్రి పాత్రకు మొదట సారా అలీ ఖాన్ ను మేకర్స్ అనుకున్నట్లు , ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే సారా అలీ ఖాన్ ను యానిమల్ మూవీ లో తృప్తి డిమ్రి పాత్రకు మొదట అనుకున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అని , ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు అని ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా తృప్తి డిమ్రి "యానిమల్" సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించిన ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: