తమిళ డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ లభిస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్‌లో త‌మిళ స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు చేసిన సినిమాలు ఇక్క‌డ ఘోరంగా ప్లాప్ అవుతున్నాయి. రిలీజ్‌కు ముందు ఆ సినిమాల‌కు తిరుగులేని క్రేజ్ వ‌స్తున్నా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫ‌ల్టీలు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు అంద‌రి చూపు మ‌రో కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సినిమాపై పడింది. కోలీవుడ్ లో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా డైరెక్ట‌ర్‌ ఏఆర్ మురుగదాస్‌కు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. దేశం మొత్తం మెచ్చిన సినిమాలు తీసిన ఘ‌న‌త మురుగ‌దాస్ ది. అయితే గ‌త కొంత కాలంగా మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తోన్న‌ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ర‌జ‌నీకాంత్‌తో ద‌ర్బార్‌, స‌ల్మాన్‌ఖాన్ - ర‌ష్మిక కాంబోలో తీసిన సికింద‌ర్ డిజాస్ట‌ర్ అయ్యాయి.


దీంతో ఇప్పుడు ఆయన తెరకెక్కించిన ‘మదరాసి’ ఎలా ఉంటుందో అనే సందేహం తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ మాట‌కు వ‌స్తే ఒక్క మురుగదాస్ అనే కాదు, తమిళ దర్శకులు తెరకెక్కించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. దర్శకుడు శంకర్ భార‌తీయుడు 2, ‘గేమ్ ఛేంజర్’, మణిరత్నం ‘థగ్ లైఫ్’ దారుణంగా ఫెయిల్ అవగా… లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’ కొంతవరకే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇలా త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుల ప్లాప్ ర‌న్‌ను మురుగ‌దాస్ మ‌ద‌రాసి సినిమాతో అయినా ఆపుతాడా లేదా అన్న‌ది చూడాలి. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో కోలీవుడ్ ప‌రువు మ‌రింత పోవ‌డం ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: