మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల టాలీవుడ్‌లో జరిగిన సినీ కార్మికుల సమ్మె కారణంగా అనేక సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఆ ప్రభావం ఈ సినిమాపై కూడా పడింది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ రద్దయిపోవడంతో సంక్రాంతి రిలీజ్ సాధ్యమా లేదా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. సంక్రాంతికి రాద‌నే ట్రేడ్ వ‌ర్గాల్లోనూ చర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సాహు గారపాటి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “సమ్మె వల్ల సుమారు 15 రోజుల షూటింగ్ ఆగిపోయింది. అయినా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ వేగంగా కొనసాగుతోంది. నవంబర్ 15లోపు షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి , సంక్రాంతికి తప్పకుండా రిలీజ్ చేస్తాం” అని ధైర్యంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.


ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఆయన ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ టచ్‌కి ప్రసిద్ధి. అందువల్ల చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి గారిని పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ షేడ్‌లో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, ఈ జంటను మళ్లీ తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల సహ నిర్మాతగా వ్యవహరించడం మరో ప్రత్యేకత. చిరంజీవి గారి పాత్రలో ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని టీమ్ చెబుతోంది. మొత్తానికి, సమ్మె వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరిగినా, టీమ్ ప్లానింగ్ బలంగా ఉండటంతో సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించబోతోందని చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలపై అభిమానుల్లో మళ్లీ నమ్మకం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: