తెలుగు సినీ పరిశ్రమ లో మంచి క్రేజ్ కలిగిన నటీ మణుల లో రాశి ఖన్నా ఒక రు . ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తో నే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు రావ డం జరిగింది. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను సాధించడంతో ఈమెకు తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది.

ఈమె ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించినా ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించలేదు. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. దానితో ఈమె ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే తెలుగు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాలలోనే నటించింది. ఇక మళ్ళీ ఈమె తెలుగు లో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మరో తెలుగు సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు మూవీలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలను అందుకున్నట్లయితే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: