సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్  కౌచ్ గురించి తరచూ వేర్వేరు   వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి. కొంతమంది వైరల్ అయిన వార్తలు నిజమని చెబితే మరి కొందరు  మాత్రం ఆ వార్తల్లో  ఏ మాత్రం  నిజం లేదని  కామెంట్లు చేస్తున్నారు.  అయితే  డ్యాన్సర్, బిగ్ బాస్ ఫేం నైనిక తనకు ఎదురైన   చేదు అనుభవాల గురించి  షాకింగ్ కామెంట్లు చేశారు. సినిమా  ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్ గా తయారైందని  అందరు  గలీజ్ అయిపోయారని ఆమె అన్నారు.

ఇప్పుడు  ఓపెన్ గానే  కమిట్మెంట్ అడిగేస్తున్నారని  నైనిక చెప్పుకొచ్చారు.  ఆ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని  బ్రాండ్ ప్రమోషన్స్ కోసమని చెప్పి  పర్సనల్ రిక్వెర్మెంట్  అడిగారని నైనిక పేర్కొన్నారు.  ఆయన బ్రాండ్  ప్రమోట్ చేయాలేమో  అని అనుకున్నానని  కానీ మళ్ళీ   పర్సనల్ రిక్వెర్మెంట్ అని చెప్పడంతో నాకు అర్థమైందని నైనిక చెప్పుకొచ్చారు.  మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా  బయటకు వెళ్తుంది అని ఆ వ్యక్తి చెప్పాడని నైనిక తెలిపారు.

ఇండస్ట్రీలో ఉన్న కొందరు అమ్మాయిల వల్ల ఈ ఫార్మాట్ క్రియేట్ అయిందని ఆమె పేర్కొన్నారు.  కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలామంది అనుకుంటారని  కొంతమంది అలా చేస్తున్నారు కూడా అని నైనికా తెలిపారు.  ఒకవేళ నాకు కూతురు ఉంటె ఇండస్ట్రీలోకి రానివ్వనని  ఈ ఫీల్డ్ మంచిది కాదని నా కూతురికి చెబుతానని ఆమె కామెంట్లు చేశారు.

డాడీ మాతో ఉండరని డొమెస్టిక్ వయొలెన్స్ చేశారని  నాన్న మంచోడు కాదని అమ్మను  టార్చర్ చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.   అందుకే నేను డాడీని  ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పానని  ఇప్పుడు నాన్న మాతో ఉండటం లేదని  నాన్నను మిస్సైన ఫీలింగ్  నాకు ఎప్పుడూ  కలగలేదని నైనిక పేర్కొన్నారు. నైనిక చెప్పిన విషయాలు  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.   నైనిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: