టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన  తేజ సజ్జా  హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మిరాయ్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా  ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ  సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేశారు.  భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

కళింగ యుద్ధం అనంతరం అశోకుడు  తన దగ్గర ఉన్న 9 గ్రంథాల వల్లే  విజయం దక్కినా యుద్ధంలో ఎంతోమంది  ప్రాణాలు కోల్పోయారని పశ్చాత్తాపం చెందుతాడు.  ఆ గ్రంథాలను  ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలలో ఉన్న రక్షకులకు ఇస్తాడు.  అయితే సమాజాల్లో ఛీత్కారాల వల్ల తాను  దేవుడిగా మారాలని భావించే మహావీర్ (మంచు మనోజ్) ఎనిమిది గ్రంథాలను చేజిక్కించుకుంటారు.  అయితే వేద ప్రజాపతి (తేజ) సాధించిన తొమ్మిదో గ్రంథం  మహావీర్ చేతులలోకి వెళ్తుందా?  తేజ సజ్జా లక్ష్యాన్ని  సాధించడంలో  మిరాయ్ పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.


కథనం :

కథగా చెప్పుకుంటే  టాలీవుడ్ ఇండస్ట్రీలో  పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కథ ఈ సినిమాలో ఉంది. సినిమాలో  విజువల్ ఎఫెక్ట్స్ సైతం టాప్ లెవల్ లో ఉన్నాయి.  అయితే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటే  బాగుండేది. సినిమాలో లాజిక్ కు అందని సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.  హీరో బుద్ధిబలాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలను అధిగమించినా ఆ సన్నివేశాలు నమ్మశక్యంగా లేవు.

వైబ్ ఉంది పిల్లా అంటూ సినిమాపై అంచనాలను పెంచిన సాంగ్ ను కట్ చేసి  ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. తేజ సజ్జా  ఈ సినిమాలో  సైతం కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మంచు మనోజ్ నటన బాగానే ఉన్నా ఆయన పాత్ర అంత  శక్తివంతంగా మారడానికి సంబంధించిన సన్నివేశాలను సరిగ్గా క్రియేట్ చేయలేదు.  కథలో వచ్చే ట్విస్టులు బాగానే ఉన్నా మెజారిటీ ట్విస్టులను  ఊహించవచ్చు.

ఒకింత షాకింగ్ సన్నివేశంతో ఇంటర్వెల్ సీన్  ఉంటుందని భావించిన ప్రేక్షకులు సైతం నిరాశ చెందుతారు.  శ్రియ, జయరాం,  రితికా నాయక్, గెటప్ శ్రీను  పాత్రల పరిధి మేర నటించారు.  తేజ సజ్జా, రితికా నాయక్  కాంబినేషన్ సీన్స్ ను మరింత అద్భుతంగా ప్లాన్  చేసి ఉంటే  బాగుండేది.  కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.

టెక్నీకల్ గా మాత్రం ఈ  సినిమా టాప్ లో ఉంది.  పీపుల్స్ మీడియా బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండగా  ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది. హీరో  విలన్ ఎదురెదురు పడే సన్నివేశాలు ఎక్కువగా ఉండి  ఉంటే  ఈ సినిమా స్థాయి మరింత పెరిగేది. క్లైమాక్స్ ను ఒకింత హడావిడిగా ముగించారని భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

 బలాలు ; ప్రధాన పాత్రధారుల నటన,  ఫస్టాఫ్, విజువల్ ఎఫెక్ట్స్

బలహీనతలు :  సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో ల్యాగ్,  స్క్రీన్ ప్లే, ఎడిటింగ్

రేటింగ్ : 3.0/5.0
[06:49, 9/12/2025] raj: మిరా

మరింత సమాచారం తెలుసుకోండి: