ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా సంచలనం సృష్టించిన సినిమా మహావతార్ నరసింహ. డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఒక యానిమేటెడ్ పౌరాణిక ఇతిహాసం సినిమా. ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద బ్లాక్ బాస్టర్ చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. రూ .40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అన్ని అంచనాలను తారుమారు చేసి బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ .300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ తో సరికొత్త కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.


సెప్టెంబర్ 12కి మహావతార్ నరసింహ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర బృందం ఒక పోస్ట్ ని తెలియజేస్తూ.. మహావతార నరసింహ  ఇంకా 200 పైగా థియేటర్లలో ఆడుతోంది, బుక్ మై షోలో రోజుకు పదివేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలియజేసింది. ఈ 50 రోజులలో బుక్ మై షో ద్వారా సుమారుగా 67 లక్షలకు పైగా టికెట్లు కొనుగోలు చేశారంటూ తెలిపింది. ఈ సినిమా 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా డిలీట్ సీని విడుదల చేశారు చిత్ర బృందం.


తాజాగా విడుదల చేసిన ఈ డిలేట్ సీన్ చూస్తూ ఉంటే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. వీడియో విషయానికి వస్తే.. హిరణ్యకశ్యప అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తు తనని ఇలా ప్రశ్నిస్తుంది?. నిన్ను నువ్వు మహా పరాక్రమమైన , సర్వశక్తుడిగ భావిస్తుంటావు.. కానీ నీకు ఐదేళ్ల వయసు ఉన్న చిన్నపిల్లాడిని చంపడం కూడా చేతకాలేదంటూ .. మరి నువ్వు ఆ విష్ణువుని ఎలా చంపగలవు అంటూ నవ్వుతున్నట్లు చూపించారు.. ఇలాగే నువ్వు చేస్తూ ఉంటే నీ కోపాన్ని చూసి కుక్క కూడా భయపడదని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి డిలీట్ సీను కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: