మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం ఇద్దరు పెళ్లికి రెడీగా ఉన్నారు. వాళ్లే సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్. ఇద్దరు అన్నదమ్ముల పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సాయి దుర్గ తేజ్ పెళ్లి గురించి ఇప్పటికే పలు రూమర్లు వినిపించాయి. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కూడా అన్న పెళ్లి చేసుకోవడం లేదని అన్నకంటే ముందే పెళ్లికి రెడీ అయ్యారు అంటూ కొన్ని రూమర్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయి దుర్గ తేజ్ ఒక కార్యక్రమంలో పాల్గొని నాకు బ్రేకప్ జరిగింది అది అంతా మీ వల్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ సాయి దుర్గ తేజ్ బ్రేకప్ కి కారణం ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సాయి దుర్గ తేజ్ బ్రేకప్ కి కారణం ఎవరో కాదు మీడియానే నట. 

అవును ఈ విషయాన్ని స్వయంగా సాయి దుర్గ తేజ్ తాజా కార్యక్రమంలో బయట పెట్టారు. నాకు కాలేజీ డేస్ లో ఓ లవర్ ఉండేది.ఆమెనే నేను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ మీడియా చేసిన అతి వల్ల నా లవర్ నాకు కాకుండా పోయింది. బంగారం లాంటి పిల్ల నన్ను కాదని వెళ్ళిపోయింది.ఎందుకంటే నేను ఇండస్ట్రీ లోకి వచ్చాక మీడియాలో నేను ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాను.. ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ రూమర్లు రాశారు.ఈ రూమర్ల కారణంగానే నా లవర్ కి నాకు మధ్య గొడవలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలను సహించలేకపోయింది. దాంతో నాకు బ్రేకప్ చెప్పింది. 

అలా 2023లో మా బ్రేకప్ జరిగింది.మీడియా నా పెళ్లి గురించి రూమర్లు క్రియేట్ చేయకపోయి ఉంటే నేనే నా పెళ్లి గురించి మీకు అఫీషియల్ గా అనౌన్స్ చేసే వాడిని. కానీ మీడియా నా పెళ్లి చెడగొట్టేసింది. ఇక ఇప్పుడైతే నేను సింగల్ గానే ఉన్నాను అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. అయితే తనకు కాబోయే భార్యకి తానే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని కూడా సాయి దుర్గ తేజ్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అయితే సాయి దుర్గ తేజ్ ఈ విషయాలన్నీ తాజాగా ఆయన పాల్గొన్న అభయం మసూమ్ సమ్మిట్- 2025 అనే కార్యక్రమంలో బయటపెట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై,అకృత్యాలపై కూడా నోరు విప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: