"విశ్వంభర"  సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైందో ఎవరికీ కచ్చితంగా తెలియదు.. కానీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, వైరల్ అవుతూ, తరచూ ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ లాంటి లెజెండరీ స్టార్ నటిస్తున్నాడని తెలిసినా, కొంతమంది సోషల్ మీడియా ఆకతాయిలు, యూట్యూబ్ రివ్యూవర్స్, మరియు కొన్ని ట్రోలింగ్ పేజీలు మాత్రం ఉద్దేశపూర్వకంగా మెగా ఇమేజ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సినిమా మీద నెగిటివ్ అజెండాను సృష్టిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.


మొదట ఈ సినిమా హీరోయిన్ ఎంపికపైనే ట్రోలింగ్ మొదలైంది. "ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఈ హీరోయిన్ ఎందుకు?" అంటూ వాదనలు చెలరేగాయి. ఆ తర్వాత కథ కాన్సెప్ట్ గురించి కూడా నెగిటివ్ రూమర్స్ వ్యాప్తి చెందాయి. అంతేకాకుండా, ఈ సినిమా రీలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడడం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. మొదట ప్రకటించిన రిలీజ్ డేట్ కంటే దాదాపు ఏడాది ఆలస్యంగా కూడా సినిమా థియేటర్లకు రాలేదు. ఈ కారణంగా సోషల్ మీడియాలో "విశ్వంభర ఎప్పుడొస్తుంది?" అంటూ మీమ్స్, ఫన్నీ పోస్టులు వరుసగా వైరల్ అయ్యాయి.



ప్రస్తుతం కూడా ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్  పనులు పూర్తవ్వక, పోస్ట్ ప్రొడక్షన్ మరింతగా లేట్ అవుతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కూడా ఈ సినిమా విడుదలలో జాప్యం కారణంగా “విశ్వంభర టీమ్ అసలు ఏమి చేస్తోంది? ఎందుకు ఇన్ని నెలలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో మరోసారి "విశ్వంభర"పై నెగిటివ్ ట్రోలింగ్ ప్రారంభమైంది. కారణం ఏమిటంటే—ఇటీవలే విడుదలైన "మిరాయి" సినిమా. తేజ  హీరోగా నటించిన ఈ సినిమా, చిన్న బడ్జెట్ తో రూపొందినా, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్వయంగా చెప్పినట్లుగా, ఈ సినిమాకి పెద్దగా డబ్బులు ఖర్చు చేయకుండా, తక్కువ సమయం తీసుకుని, అత్యంత నాణ్యమైన విజువల్స్ తెరపై చూపించారు. ఈ క్వాలిటీని చూసి అందరూ ప్రశంసలు కురిపించారు.



అయితే ఈ విజయమే ఇప్పుడు "విశ్వంభర" టీమ్ కి కష్టంగా మారింది. ఎందుకంటే, మెసేజ్ ఓరియెంటెడ్ భారీ కాన్సెప్ట్ తో వస్తున్న "విశ్వంభర" సినిమా, అంతకాలం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండి కూడా ఇంకా రిలీజ్ కాకపోవడం సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. "ఇంత భారీ ప్రాజెక్ట్ కి ఇన్ని సంవత్సరాలు పట్టి కూడా వీఎఫ్‌ఎక్స్ లెవెల్ బాగోలేకపోతే ఈ సినిమా ఘోరంగా దెబ్బతింటుంది. ఇంత ఆలస్యానికి ఫలితం ఏమిటి?" అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ నెగిటివ్ వేవ్ సృష్టిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా, సినిమా మీద నెగిటివ్ అజెండా నడిపిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, "విశ్వంభర" సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? ఇందులో ఉన్న విజువల్స్ లెవెల్ ఎలా ఉంటాయి..?  మెగాస్టార్ ఇమేజ్ కి సరిపోయేలా సినిమాను టీమ్ డెలివర్ చేస్తుందా..? అన్నది ఆసక్తికర చర్చగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: