కోలీవుడ్ నటుడు ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈయన నటించిన ఎన్నో తమిళ సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యి ఇక్కడ కూడా చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. దానితో ఈయన నేరుగా కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే తెలుగు సినిమా లో నటించాడు.

మూవీ మంచి విజయం సాధించింది. తాజాగా ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే తెలుగు సినిమాలో కూడా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇలా తెలుగు లో ఈయన నటించిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈయన ఇడ్లీ కడాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిత్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. 

తెలుగులో ఈ సినిమాలో ఇడ్లీ కొట్టు అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క సిడెడ్ హక్కులను దీప ఆర్ట్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ సంస్థ వారు ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే సీడెడ్ ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: