
అయితే కొంతమంది సెలబ్రిటీలు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు ప్రత్యేకించి మరీ అడుగుతూ ఉంటారు. వారు చెప్పిన సమాధానాలు ఆ సెలబ్రిటీల పైన గౌరవం పెంచేలా చేస్తూ ఉంటాయి. తెలియని సమాచారాన్ని కూడా అభిమానులకు అందిస్తూ ఉంటాయి. ఇదంతా ఓకే అయినప్పటికీ చాలా చోట్ల మాత్రం సంస్కారాన్ని మర్చిపోతూ హీరోయిన్స్ శరీరం పైన పుట్టుమచ్చలెన్ని అడిగే స్థాయికి పడిపోయింది సినీ జర్నలిజం. అలాగే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా అనే చోట మరింత ఇబ్బంది పడేసేలా చేస్తున్నాయి.ఇలాంటి ఇంటర్వ్యూస్ కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలు ఉంటాయి చివరికి సినిమా జర్నలిజం అంటే చిన్నచూపు చూసేలా మారిపోతున్నాయి.
ఇటీవలే మంచు లక్ష్మి, జర్నలిస్టు మూర్తి మధ్య జరిగిన ఈ వ్యవహారం అందుకు ఉదాహరణగా మారింది. ప్రశ్నలతో జర్నలిస్ట్ తనను బాడీ షేమింగ్ చేశారంటూ ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ మంచు లక్ష్మి ఒక లేఖ పంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు సరైనవి కాదు, కానీ ఆ ప్రశ్నలకు సరిపడే సమాధానాన్ని కూడా మంచు లక్ష్మి అక్కడే ఇచ్చేసింది.. ముఖ్యంగా అలాంటి ప్రశ్నలను హీరోలను అడగగలరా అంటూ ఆమె కట్టి కౌంటర్ ఇచ్చింది.
వాస్తవానికి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ ప్రశ్నలు అన్నిటిని కూడా డిలీట్ చేయండి అని అడిగే హక్కు కూడా మంచు లక్ష్మికి ఉంటుంది. అలాంటి పని చేసి ఉంటే బాగుండేదని అభిమానులు కూడా మాట్లాడుకుంటున్నారు. లేకపోతే యూట్యూబ్ ఛానల్ అయిన ఆ ప్రశ్నలను టెలికాస్ట్ కాకుండా చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఈ రెండు జరగలేదు.. చివరికి మంచు లక్ష్మి ఆ జర్నలిస్ట్ పైన ఫైర్ అవుతూ ఒక లేఖ రాశారు. అలాగే క్షమాపణలు చెప్పాలి అంటు లెటర్ ద్వారా కోరింది. మా అసోసియేషన్ వెంటనే స్పందించి వ్యవహారం పైన జర్నలిస్టుని వివరణ అడగగా మూర్తి కూడా ఇచ్చారు.
ఇంటర్వ్యూ ని పూర్తిగా తొలగించిన సోషల్ మీడియాలో మాత్రం చిన్న చిన్న బిట్లుగా అక్కడక్కడ వైరల్ అవుతున్నాయి. కేవలం ఏదో ఒక వివాదాస్పదమైన ప్రశ్న ఉంటే తప్ప ఇంటర్వ్యూ పాపులర్ కాదేమో అనే అభిప్రాయంలోకి మారిపోయింది. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి కార్నర్ చేయడం.. లేకపోతే కాంట్రవర్సీలే ద్వేయంగా, మసాలా ప్రశ్నలని టార్గెట్ చేస్తూ అడుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఇంటర్వ్యూలు వల్ల సెలబ్రిటీలే చివరికి మాకు ఈ ఇంటర్వ్యూలు వద్దు బాబోయ్ అని దండం పెట్టి వెళ్లిపోయే పరిస్థితి చేస్తున్నారు. మరి ఇక మీదనైనా ఈ దోరనని మార్చుకుంటారేమో చూడాలి.