
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వార ఓజి మూవీ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తు..పవన్ కళ్యాణ్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకునే వారిలో తాను కూడా ఒకరిని ఓజి మూవీ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తు ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్ గాడ్.. అంటు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఓజి సినిమా సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు.. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు నారా లోకేష్. అనంతరం మరో టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఒక కీలకమైన ప్రకటన చేస్తూ తానే దగ్గరుండి మరి ఓజి సినిమాకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.
OG సినిమా స్టోరీ విషయానికి వస్తే తాను నమ్మే వ్యక్తి కోసం మాఫియాను అంతం చేయడానికి హీరో ఏం చేశారు? అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కించారు డైరెక్టర్ సుజిత్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన ,ఇమ్రాన్ హస్మి విలనిజం, థమన్ అందించిన మ్యూజిక్, ఎలివేషన్స్ హైలెట్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ట్విస్టులు, ఎమోషన్స్ లేకపోవడంతో పాటుగా హీరోయిన్ కి పెద్దగా స్కోప్ కనిపించలేదనీ నేటిజన్స్ తెలుపుతున్నారు. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉన్నప్పటికీ అభిమానులకు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు డైరెక్టర్ సుజిత్.