తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఓ వైపు కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయ పనుల్లో కూడా అత్యంత బిజీగా ఉంటున్నాడు. ఇకపోతే తాజాగా విజయ్ ఓ ర్యాలీని నిర్వహించాడు. ఈ ర్యాలీ కారణంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు , అలాగే 50 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఇంత పెద్ద స్థాయిలో తొక్కిసలాట జరగడానికి ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఇంతమంది పరిస్థితి విషమంగా ఉండడానికి కారణాలు ఏంటి అనే దానిపై అనేక మంది అనేక వాదనలను వినిపిస్తున్నారు. ఇకపోతే ఇంత పెద్ద స్థాయిలో తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణాలుగా అనేక మంది మాత్రం చూపిస్తున్న వాటిలో విజయ్ టీం నిర్లక్ష్యం. అలాగే విజయ్ కూడా ఎందుకు పరోక్షంగా కారణమే అని అంటున్నారు. అది ఎలా అనుకుంటున్నారా ..? పోలీసులు ఈ ర్యాలీలో కేవలం పది వేల మంది మాత్రమే పాల్గొనాలి అనే నిబంధనతో పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ర్యాలీ కి ఏకంగా 50 వేల మంది కి పైగా జనాలు రావడంతో చాలా చిన్న ప్రదేశంలో ఎక్కువ మంది గుమిగోడడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లు విజయ్ టీమ్ కూడా దీనిని సరిగ్గా మానేజ్ చేయలేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే విజయ్ ఈ ర్యాలీకి రావలసిన సమయం కంటే దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా వచ్చినట్లు , అలా ఏడు గంటలు ఆయన ఆలస్యంగా రావడంతో ఇంకా ఎక్కువ మంది జనాలు అక్కడికి వచ్చినట్లు , చాలా ఆలస్యంగా రావడంతో విజయ్ రావడంతో ఒక్క సారిగా జనాలందరూ అతని చూడడానికి రావడంతో ఈ తొక్కి సలాట జరిగినట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా విజయ్ ర్యాలీ వల్ల పెద్ద మొత్తంలో జనాలు చనిపోయారు. అలాగే అనేక మంది ఇప్పటికి ప్రాణప్రయ స్థితిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: