పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి గత రెండు మూడు రోజులుగా ఒక సంచలన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ కు తండ్రిగా చిరంజీవి నటిస్తున్నారని వినిపిస్తున్నాయి.



ఈ విషయాన్ని ఇప్పటివరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఏ చిత్రంలో కూడా గెస్ట్ రోల్ చేయలేదని, ప్రభాస్ కు తండ్రి పాత్రలో ఆయన కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగా లేవు! ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం హీరోగా కొన్ని సినిమాలలో నటిస్తున్నారు. ఒకవైపు శివ శంకర వరప్రసాద్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అలాగే విశ్వంభర సినిమాని సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. వీటికి తోడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరొక సినిమా చేస్తున్నారు.



దీన్ని బట్టి చూస్తే ఇంకో రెండేళ్ల పాటు చిరంజీవి బిజీ అన్నమాట. కాబట్టి ఒకవైపు మెయిన్ హీరోగా చేస్తున్న సమయంలో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి తండ్రి పాత్రలో అంటే కనిపించే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా కనిపిస్తే మాత్రం కచ్చితంగా చిరంజీవి నటించే సినిమాల పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా చిరంజీవితో ఇలాంటి పాత్ర చేయించాలని అసలు ఆలోచించరు. అందుకే ఈ వార్తలలో నిజం ఉండదంటూ ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: