
ఇలాంటి సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో కలుసుకున్నారు. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కాంతార చాప్టర్ వన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. స్టేజ్ పైకి వచ్చిన ఎన్టీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడంతో పాటు, ఈ సినిమాతో తన జీవితానికి ఉన్న అనుబంధాన్ని అభిమానుల ముందుంచారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ..“నాకు చిన్నప్పుడు దాదాపు మూడేళ్ల వయసులో మా అమ్మమ్మ తరచూ కుందాపుర సమీపంలోని మా ఊరికి రావాలని చెప్పేది. అప్పట్లో ఆమె చెప్పిన కథలు నాకు బాగా గుర్తున్నాయి. ముఖ్యంగా గుళిగా.. పంజర్లి గురించి చెప్పిన విషయాలు నా బాల్యంలోనే నాకు ఆసక్తిని కలిగించాయి. నిజంగానే ఇవి జరుగుతాయా అనే సందేహం అప్పట్లో నాకు ఉండేది. ఆ కథలను నేను విన్నప్పుడు, ఒక దర్శకుడు వాటిని తెరపైకి తీసుకువస్తాడని అసలు ఊహించలేదు. కానీ రిషబ్ శెట్టి ఆ కలను నిజం చేశారు. నేను చిన్ననాటి నుంచి విన్న ఆ కథలను సినిమాగా తెరపై చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. అది మాటల్లో చెప్పలేనంత అనుభూతి. నేను కథ తెలిసి ఇంత ఆశ్చర్యపోతే, ఇప్పుడు కొత్తగా చూసే వారు ఎంత మైమరచిపోయి ఉంటారో ఊహించండి. అదే కాంతార రిజల్ట్” అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. ఆయన మాటలు వినగానే అక్కడి ప్రేక్షకులు ఘనంగా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే తన మాటలతో అందరినీ ఇంప్రెస్ చేస్తాడని తెలిసిందే. సాధారణంగా ఆయన ఎక్కువసేపు స్పీచ్ ఇస్తారు. కానీ ఈసారి తక్కువ సేపు మాట్లాడినా, సినిమా మీద అద్భుతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు కాంతారా చాప్టర్ వన్ సినిమాపై పెద్దగా టాక్ వినిపించకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్ మీద నుంచి ప్రమోట్ చేయడంతో సినిమా మీద హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆయన మాటలతో ఈ సినిమా మరింత హైప్‌కి చేరుకుంది. అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన క్రేజ్ ఈ సినిమాకి ఎంతవరకు కలిసివస్తుందన్నది..??