
గాయం కారణంగా నొప్పితో బాధపడుతున్నప్పటికీ, ఆయన సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి చేశారు. అంతేకాక, రిషబ్ శెట్టి కోసం నిర్వహించిన కాంతార: చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. నిజానికి ఈ ఈవెంట్ ప్లాన్ చాలా రోజుల క్రితమే ఖరారు చేశారు. కాగా, ఎన్టీఆర్ గాయపడిన తరువాత నిర్వాహకులు ఆయన హాజరుకాకపోవచ్చని అనుకున్నారు. అయితే, తన స్నేహితుడి ఆహ్వానం వదులుకోకుండా, “ఎలాగైనా వస్తాను” అని మాట ఇచ్చినట్టుగానే ఆయన ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఎన్టీఆర్ స్టేజ్‌పైకి ఎక్కిన క్షణం నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అందరికీ అర్థమైంది. ఆయన మైక్ పట్టుకొని రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడారు. అయితే శరీరం సహకరించకపోవడంతో ఆయన పదేపదే తన చేతిని పక్కటెముకుల పై పెట్టుకుంటూ నొప్పిని భరిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక దశలో స్పీచ్ కొనసాగించడం కష్టమై, “మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను” అంటూ సింపుల్‌గా ముగించారు. చివరగా అక్కడ ఉన్న అభిమానులకు, “ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి” అని సూచించారు.
ఈవెంట్ అనంతరం అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ముందుకు రాగా, ఎన్టీఆర్ నిలబడే స్థితిలో లేకపోవడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. నొప్పితో నడవలేక, బాగా ఇబ్బంది పడుతూ వెళ్లిపోతున్న ఆయన దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఆ వీడియోలు చూసి బాధపడుతూనే, తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. గాయంతో ఇంతటి బాధలో ఉన్నప్పటికీ, స్నేహితుని కోసం ఈవెంట్‌కి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫెషనలిజాన్ని, స్నేహాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. “జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకెంత ఇష్టం, ఆయన చూపించే అంకితభావం, స్నేహబంధం, అభిమానులపై చూపించే ప్రేమే ఆయన గొప్పతనం”..అందుకే అభిమానులకి ఆయన అంటే అంత ఇష్టం..!