పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన తాజా మూవీ ఓజి సెప్టెంబర్ 25న విడుదలై దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ఉంది.దీంతో తాజాగా సక్సెస్ మీట్ ని నిర్వహించారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మరొకసారి బ్లాక్ కలర్ షర్టు ప్యాంట్ లో మెరిసి అదరగొట్టారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లినా వైట్ కలర్ డ్రెస్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజి సినిమా కోసం ఒక్కసారిగా తన డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చేశారు.ఈ డ్రెస్సింగ్ స్టైల్ తో పవన్ కళ్యాణ్ మునుపటి లుక్ ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు.అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఓజి సక్సెస్ మీట్ లో నా బలహీనతతో ఆడుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ హిట్ అవ్వడంతో హైదరాబాదులోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరొక్కసారి బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపించారు.ఇక ఓజి సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో డైరెక్టర్ సుజిత్, తమన్ ఇద్దరు నన్ను కటారి పట్టుకొని రమ్మని చెప్పారు. అయితే బ్లాక్ కలర్ డ్రెస్ చేతిలో కటారు దానికి తోడు వర్షం.. దాన్ని పట్టుకోవడం ఓ సమస్య అయితే అందులో వర్షం మరో సమస్య నాతో అందరూ ఆడుకుంటున్నారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో అలా కోరితే ఈ సక్సెస్ ఈవెంట్ కి మాత్రం మరోలా రావాలని తెలిపారు.

బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవడంతో పాటు చేతిలో గన్ పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని రండి అని చెప్పారు. కానీ వాళ్ళు అడిగిన దానికి నేను చంపేస్తా అని చెప్పాను. ఎందుకంటే గన్ పట్టుకోవడం అనేది నా బలహీనత అని తెలిసి అందరూ నా వీక్నెస్ తో ఆడుకుంటున్నారు అంటూ ఫన్నీగా చెబుతూ ఈవెంట్లో నవ్వులు పూయించారు పవన్ కళ్యాణ్. అలాగే ఫ్యాన్స్ కోసం గన్ పట్టుకుంటున్నాను అని జానీ మూవీ టైం లోని గన్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాకుండా ఓజి సీక్వెల్, ప్రీక్వెల్ గురించి మాట్లాడుతూ ఓజి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేయడానికి నేను రెడీ గానే ఉన్నాను అని డైరెక్టర్ కి మాట ఇచ్చాను.కానీ వాటికి కొన్ని కండిషన్s ఉంటాయి అంటూ సస్పెన్స్ లో పెట్టారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: