టాలీవుడ్‌లో ఎంతోమంది నిర్మాతలు ఉన్నప్పటికీ.. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా ఎవరికీ లేదని చెప్పాలి. ముఖ్యంగా ఆయన నిర్మించే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమా బ్యానర్‌ల ద్వారా ఆయన చేసిన ప్రాజెక్ట్స్ టాలీవుడ్‌కే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. రీసెంట్‌గా అశ్వినీ దత్ ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆయన మూడవ కుమార్తె స్రవంతి నిశ్చితార్థం గ్రాండ్‌గా హైదరాబాద్‌లో బుధవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. ఈ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరగకపోయినా, కొన్ని ఫొటోలు మాత్రం బయటికి రావడంతో నెట్టింట ఇప్పుడు ఇవే వైరల్ అవుతున్నాయి.


అశ్వినీ దత్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా తనదైన స్టైల్‌లో నిలదొక్కుకుని ముందుకు వెళ్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె స్వప్న దత్, రెండో కుమార్తె ప్రియాంక దత్ ఇప్పటికే నిర్మాణ రంగంలో బలంగా దూసుకెళ్తున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘సీతారామం’ వంటి పెద్ద సినిమాలతో ఈ ఇద్దరూ తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. తండ్రి ప్రారంభించిన నిర్మాణ సంస్థలను మళ్ళీ నేషనల్ లెవెల్‌లో నిలబెట్టేంతగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. మూడవ కుమార్తె స్రవంతి మాత్రం ఇప్పటి వరకు సినిమాలతో పెద్దగా సంబంధం లేకుండా ఉంటూ వచ్చింది. అందుకే ఆమె గురించి బయట ఎక్కువగా ఎవరికీ సమాచారం తెలియదు. కానీ ఈ నిశ్చితార్థం సందర్భంగా ఆమె పేరు, ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక అశ్వినీ దత్ మూడో అల్లుడు గురించిన వివరాలు కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా చర్చించబడుతున్నాయి. ఇప్పుడు మూడవ కుమార్తె స్రవంతి వరుడు సిద్ధార్థ్ గురించిన వివరాలు బయటకు రావడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఆయన ఒక ప్రముఖ బిజినెస్ మాన్ అని, మంచి ఆర్థిక స్థితి, ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివహమా ? అనే రకరకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద అశ్వినీ దత్ కుటుంబంలో జరిగిన ఈ శుభకార్యం సినీ, రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతోంది. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలు ఇప్పటికే టాలీవుడ్‌లో నిర్మాతలుగా తమ ప్రతిభ చూపుతుండగా, ఇప్పుడు మూడవ కుమార్తె స్రవంతి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: