సాధారణంగా జనాలు అనుకునేది ఏంటంటే – సినిమా ఇండస్ట్రీలో బడా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు, పెద్దవారి అండ ఉన్నవాళ్లు చాలా ఈజీగా సక్సెస్‌ఫుల్ అవుతారనేది. “వాళ్లకు స్ట్రగుల్ అనేది ఉండదు”, “కేవలం ఫ్యామిలీ సపోర్ట్‌తోనే అవకాశాలు దక్కుతాయి” అనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించిన వ్యక్తుల్లో అల్లు శిరీష్ ఒకరు.అల్లు శిరీష్‌కి ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కుమారుడు, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు — ఇంత పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా ఆయన తన సొంత స్థానం సంపాదించుకోవడం మాత్రం కష్టంగానే మారింది.సినిమా ఇండస్ట్రీలో అల్లు శిరీష్ పేరు వచ్చినప్పుడు చాలా మంది “అల్లు అరవింద్ కొడుకు”, “బన్నీ తమ్ముడు” అనే ట్యాగ్‌తోనే గుర్తించారు. కానీ ఆయనను సొంత ప్రతిభతో నిలబడిన హీరోగా చూడలేకపోయారు.
 

ప్రారంభంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోవడంతో, సోషల్ మీడియాలో కూడా ఆయనపై ట్రోలింగ్ ఎక్కువైంది. “ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు” అంటూ చాలామంది విమర్శించారు.అయినా సరే, అల్లు శిరీష్ మాత్రం ఎప్పుడూ ఆ విమర్శలను పట్టించుకోకుండా, తన పద్ధతిలోనే ముందుకు సాగాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ ఒక కొత్త ప్రయత్నం, కొత్త లుక్ చూపించడానికి ప్రయత్నించాడు. కానీ బిగ్ హిట్ మాత్రం ఇంకా దొరకలేదు.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం – అల్లు శిరీష్ ఎప్పుడూ “ఏ కథ నచ్చితే దానిలో నటిస్తాను” అనే ఆలోచనలో ఉంటారట. అయితే ఆయన తండ్రి అల్లు అరవింద్ మాత్రం “నువ్వు బన్నీ లా టాప్‌ రేంజ్‌లోకి రావాలంటే ఒక పెద్ద డైరెక్టర్‌తో, ఒక జాక్పాట్ సినిమా కొట్టాలి” అంటూ చెప్పారట. అందుకే శిరీష్ ఎక్కువగా పెద్ద దర్శకుల కోసం వెయిట్ చేస్తూ, కొన్ని మంచి అవకాశాలను మిస్‌ చేసుకున్నారని టాక్. డైరెక్టర్లు కూడా ఒక కొత్త హీరోను పెద్ద ప్రాజెక్ట్‌లో రిస్క్ తీసుకుని సినిమా చేయడానికి వెనుకాడుతుంటారు. అందుకే ఆయన టాలెంట్‌కి సరిపడే ఛాన్స్ దొరకలేదు. కానీ నిజంగా చిన్న సినిమాల్లోనైనా ఆయన నటనను గమనిస్తే, టాలెంట్ ని గుర్తించవచ్చు.



ఇటీవల అల్లు శిరీష్ నిశ్చితార్థం జరిగిందనే వార్త బయటకొచ్చింది. “అల్లు శిరీష్” నే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. “శిరీష్ ఏం చేస్తూ ఉంటాడు?”, “ఆయనకి ఎంత సంపాదన?”, “ఏం చూసి అమ్మాయి ఇస్తున్నారు?” అంటూ రకరకాల కామెంట్లు, రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే – అల్లు శిరీష్ తన నాన్న అల్లు అరవింద్‌కి చాలా గౌరవం ఇస్తాడు. ఆయన మాటే తనకు మార్గదర్శకం. కుటుంబం అంటే ఆయనకి ప్రాణం. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎన్ని ట్రోల్స్ అయినా, తాను ఎవరి సపోర్ట్ కోసం కాదు, తన కష్టంతోనే పేరు తెచ్చుకోవాలని శిరీష్ నమ్మకం.



ఇప్పుడు ఆయన పెళ్లి డేట్ అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆ వివరాలు బయటకు రావచ్చు. ఫ్యాన్స్ మాత్రం ఈసారి ఆయన జీవితంలో కొత్త ఆరంభం సక్సెస్‌ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నారు.అల్లు శిరీష్ లాంటి వాళ్లు నిరూపించిన సంగతి ఏమిటంటే — బ్యాక్‌గ్రౌండ్ తో కాదు, బ్యాటిల్‌గ్రౌండ్ లోనే హీరో సక్సెస్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: