
అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అట్లీ ఈ సినిమాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని పలు సంధర్భాలల్లో చెప్పారు. ఆ విషయం ఈ సినిమాకి ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..? అనే డిబేట్ మొదలైంది. అట్లీ అంటే మాస్, యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్ అని అందరికీ తెలుసు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించాయి. కానీ కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అట్లీ ఎక్కువగా విఎఫెక్స్ బిగ్ స్కేల్ ప్రెజెంటేషన్ మీదే ఫోకస్ పెడతాడు. ఇప్పుడు అదే భయం అల్లు అర్జున్ అభిమానుల్లో కనిపిస్తోంది. “అట్లీ సినిమాల్లో ఉన్నంత వరకు విజువల్స్, గ్రాఫిక్స్ బాగానే ఉంటాయి కానీ కథ లోపలికి వెళ్లే కొద్ది కాస్త వీక్‌గా ఉంటే సినిమా ఇంపాక్ట్ తగ్గిపోతుంది” అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, ‘పుష్ప 2’ తర్వాత ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను వదిలి అట్లీ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు “ఇది రిస్కీ స్టెప్" అని అంటుంటే, మరికొందరు “అట్లీ విజన్ అల్లు అర్జున్ రేంజ్‌కి కొత్త డైమెన్షన్ ఇస్తుంది” అని అంటున్నారు.ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని టాక్ ఉంది. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు, అడ్వాన్స్‌డ్ CGI, విజువల్ టెక్నాలజీ వాడబోతున్నారట. అయితే ఈ భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి మైనస్ అవుతాయా..? ప్లస్ అవుతాయా..? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ విశ్లేషకులు చెబుతున్నట్టుగా — “VFX అనేది సినిమా మూడ్‌కి సపోర్ట్ చేయడానికి మాత్రమే ఉండాలి, కథను పూర్తిగా దాని మీద ఆధారపరచడం డేంజరస్. కథ కంటే విజువల్స్ ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు డిసప్పాయింట్ కాగలరు” అని సూచిస్తున్నారు.అయినా సరే, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేసింది. దీపికా జోడీగా నటించడం కూడా సినిమాకి మరో పెద్ద అట్రాక్షన్ అవుతుంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పుష్పరాజ్ తర్వాత అల్లు అర్జున్ సూపర్ హీరో అవతారంలో ఎలా మెరుస్తారో చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం – ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కూడా సంచలనాన్ని సృష్టించే అవకాశాలు చాలా ఉన్నాయి.