టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఎదిగిన హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా గతేడాది వరుస ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరంకు క సినిమాతో భారీ హిట్ దక్కింది. వరుసగా ఐదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయనే సంగతి తెలిసిందే. మరి కే ర్యాంప్ సినిమాతో కిరణ్ అబ్బవరం సక్సెస్ సాధించారో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
సరదాగా లైఫ్ ను ఎంజాయ్ చేసే కుమార్ (కిరణ్ అబ్బవరం) ఎంసెట్లో మంచి మార్కులు, ర్యాంక్ రాకపోవడంతో తండ్రి డొనేషన్ కట్టి పైచదువుల కోసం కేరళ పంపిస్తాడు. అక్కడ కుమార్ కు జాయ్ మెర్సీ (యుక్తి తరేజా) పరిచయమవుతుంది. కుమార్ ఆమెతో స్నేహం చేసి ప్రేమలో పడతాడు. అయితే హీరోయిన్ కు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది. అబద్దాలు చెబితే అస్సలు తట్టుకోలేని మనస్తత్వం ఆమెకు ఉంటుంది.
ఆమె మానసిక వ్యాధి వల్ల ఎదురయ్యే ఇబ్బందులను హీరో ఎలా ఫేస్ చేశాడు? జాయ్ మెర్సీ అలా బిహేవ్ చేయడానికి కారణమేంటి? చివరకు ఏమైంది? ఆమె మానసిక సమస్య నయమైందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా
విశ్లేషణ :
కిరణ్ అబ్బవరం ఒక్కో సినిమా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. కే ర్యాంప్ టీజర్, ట్రైలర్ ఈ సినిమా మినిమం గ్యారంటీ సినిమా అనే అభిప్రాయాన్ని కలిగించాయి. చిత్తూరు యాసలో కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ప్రధానంగా మాస్ ఆడియన్స్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
హీరో కిరణ్ అబ్బవరానికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. కిరణ్ అబ్బవరం అలవోకగా ఈ పాత్రను చేసేశాడు. హీరోయిన్ యుక్తి తరేజా భిన్నమైన పాత్రలో ఆకట్టుకుంది. ఇతర నటీనటులు పరిధిమేర నటించారు. టెక్నీకల్ గా ఈ సినిమా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. సీనియర్ నరేష్ కామెడీ ట్రాక్ బాగుంది.
సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నా ఏ ఎమోషన్ ను పూర్తిస్థాయిలో పండించలేదు. దీపావళి కానుకగా విడుదలైన సినిమాలలో తోలి స్థానంలో డ్యూడ్, రెండో స్థానంలో కే ర్యాంప్, మూడో స్థానంలో తెలుసు కదా, నాలుగో స్థానంలో మిత్ర మండలి ఉండే అవకాశాలున్నాయి.
బలాలు : కిరణ్ అబ్బవరం నటన, కొన్ని కామెడీ సీన్స్, సెకండాఫ్
బలహీనతలు : ఫస్టాఫ్, కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం
రేటింగ్ : 2.75/ 5.0