
ఇక తాజాగా లీక్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో అగ్నికుండలా వ్యాపిస్తోంది. ఆ వీడియోలో రామ్ చరణ్ ఒక లోయ నుంచి పైకి ఎక్కుతూ కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఆ కొండ ఎక్కడానికి ఇద్దరి సహాయం తీసుకుంటున్నట్లు కనిపించారు. చరణ్ మాత్రం ఒక్కడే సాహసంగా ఆ కొండ ఎక్కేశడు. ఆ క్షణాల్లో ఆయన ముఖం మీద చెమటలు కారుతుండగా, పట్టుదల స్పష్టంగా కనిపించాయి. ఆ ఒక్క సన్నివేశం చూసిన వారు రామ్ చరణ్ ఎంత కష్టపడి ఈ సినిమాకి తన శక్తి, సమయం అర్పిస్తున్నారో అర్థం చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ వీడియో చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇంత పెద్ద స్టార్ అయినా ఇంత కష్టపడతారా?”, “గ్లోబల్ స్టార్ అయినా గ్రౌండ్ లెవెల్‌లో ఇంత డెడికేషన్ చూపించడం నిజంగా ప్రేరణాత్మకం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటనపై, ఆయన శ్రమపై, ఆయన నిజాయితీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే, మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు పై కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. “మా రామ్ చరణ్‌ని ఇంత టార్చర్ ఎందుకు చేస్తున్నావు?”, “నువ్వు జూనియర్ రాజమౌళి అయిపోయావా?” అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే బుచ్చిబాబు అభిమానులు మాత్రం ఆయన విజన్‌పై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. “అంత కష్టపడి తీయబడిన సీన్ తప్పకుండా మంత్ర ముగ్ధులను చేస్తుంది. రామ్ చరణ్ కూడా తన పాత్రకు ఆ స్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్నారు” అంటూ సమర్థిస్తున్నారు. మొత్తానికి, లీక్ అయిన ఈ వీడియో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మూడింతలు పెంచింది. రామ్ చరణ్ ఫిజికల్ ఎఫర్ట్, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్ చూసినవారికి ఒకే మాట గుర్తుకొస్తోంది — “ఇదే రామ్ చరణ్ రేంజ్!”ఇప్పుడు అందరి దృష్టి “పెద్ది” మూవీ ఫైనల్ అవుట్‌పుట్ మీదే. అభిమానులు మాత్రం ఇప్పటికే ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా డిక్లేర్ చేస్తూ సోషల్ మీడియా లో సంబరాలు చేసుకుంటున్నారు.