టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ముకుంద అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈయన కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ వరుణ్ తేజ్ వరుస పెట్టి భారీ అపజాయాలను అందుకుంటు వస్తున్నాడు. ఈయనకు ఆఖరుగా విజయం దక్కి చాలా కాలమే అవుతుంది. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుణ్ , విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వరుణ్ , విక్రమ్ సిరికొం  డ కాంబో లో మూవీ రాబోతుంది అని అనేక రోజులుగా వార్తలు వస్తున్నా యి . ఆల్మోస్ట్ ఈ కాంబో మూవీ ఫైనల్ అయినట్లు మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే వరుణ్ కి విక్రమ్ ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని వివరించినట్లు , అది వరుణ్ కి అద్భుతంగా నచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం మొదటి షెడ్యూల్ ను యూ ఎస్ ఏ లో స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vt