దాదాపు మూడు సంవత్సరాల క్రిశం రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా అనే సినిమా మొదట కన్నడలో విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. ఆ సినిమా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది. తాజాగా కాంతారా చాప్టర్ 1 అనే టైటిల్ తో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేశారు.

ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 91 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 16 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం. 16 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 29.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 9.8 కోట్లు , ఉత్తరాంధ్ర లో 8.50 కోట్లు , ఈస్ట్ లో 3.65 కోట్లు , వెస్ట్ లో 2.54 కోట్లు , గుంటూరు లో 3.33 , కృష్ణ లో 3.79 కోట్లు , నెల్లూరు లో 1.98 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 16 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 61.98 కోట్ల షేర్ ... 97.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలవాలి అంటే 29.09 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ అన్ని కోట్ల షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి హిట్ స్టేటస్ను అందుకోవడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను  వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs