టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం వల్ల ఈ మూవీ తో చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆఖరుగా చరణ్ గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. చరణ్ తన కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం మణిరత్నం దర్శకత్వంలో ఓకే బంగారం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా ... నిత్య మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ ని మణిరత్నం మొదట దుల్కర్ సల్మాన్ తో కాకుండా రామ్ చరణ్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రామ్ చరణ్ ను కలిసి కథను కూడా వివరించాడట. కానీ రామ్ చరణ్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను చేయలేను అని మణిరత్నం కి చెప్పాడట. దానితో మణిరత్నం ఈ మూవీ కథను దుల్కర్ సల్మాన్ కి వినిపించాడట. దుల్కర్ సల్మాన్ కి ఈ మూవీ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో మణిరత్నం "ఓకే బంగారం" సినిమాను దుల్కర్ సల్మాన్ తో చేసినట్లు తెలుస్తోంది. చరణ్ ఇలా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఓకే బంగారం సినిమా ఆఫర్ ను వదులుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: