టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే బోయపాటి శ్రీను , రవితేజ హీరో గా మీరా జాస్మిన్ హీరోయిన్ గా రూపొందిన భద్ర అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను బోయపాటి శ్రీను కు ఆ సమయం లో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే భద్ర మూవీ కి గాను తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను అనే విషయాన్ని బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా బోయపాటి శ్రీను "భద్ర" మూవీ రేమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ... భద్ర సినిమా కోసం నేను ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోలేదు. దిల్ రాజు గారు ఆ సినిమాకు నాకు నెలకు 40,000 రూపాయలు ఇచ్చేవారు. ఆ దాని తోనే నేను సినిమా చేశాను అని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు. ఇకపోతే బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. దానితో అఖండ 2 మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: