నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్  అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రేరణ అరోరా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.


జటాధర సినిమా జర్నీ ఎలా మొదలైంది.. ?
తెలుగులో సినిమా చేయాలనేది ఎప్పటినుంచో నా కల. తెలుగు సినిమా, తెలుగు కల్చర్ అంటే చాలా ఇష్టం. నేను హిందీలో సినిమాలో చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. రామ్ చరణ్ గారి ఆరెంజ్ సినిమా చూశాను. అప్పటి నుంచి నాకు తెలుగు సినిమా పట్ల చాలా పాషన్ వచ్చింది. తెలుగు సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కమర్షియల్, మాస్,  హ్యాపీ, ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్ తో సినిమాలు వస్తుంటాయి. తెలుగు సినిమా చాలా గొప్ప సినిమాలని ఇండియన్ సినిమాకి అందించింది.
ఐశ్వర్య రజనీకాంత్ గారితో నేను ఒక సాంగ్ కి వర్క్ చేశాను. సౌత్లో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడే రామోజీ ఫిలింసిటీని విజిట్ చేశాను. తర్వాత సుధీర్ బాబు గారి ద్వారా వెంకట్ అభిషేక్ ని కలిసాను. అప్పుడు జటాధర కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది.


- జటాధర చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఇందులో ఫ్యామిలీ, ఎమోషన్స్, సూపర్ నేచురల్, మైథలాజికల్ అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి. ఇది పాన్ ఇండియా కంటెంట్. అందుకే హిందీలో కూడా ఈ సినిమాని చేయాలనుకున్నాం. అలా తెలుగు, హిందీలో రెండు భాషల్లోనూ ఈ సినిమాని చేయడం జరిగింది. సినిమా విజువల్ గా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.  


సుధీర్ సుధీర్ బాబు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది.. ?
-సు ధీర్ బాబు గారంటే నాకు చాలా అభిమానం. ఆయన సినిమాలు చూస్తుంటాను. నేను తెలుగులో చేసిన మొదటి సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా పాషన్ తో వర్క్ చేశారు. ఇందులో చాలా చాలెంజింగ్ గా అనిపించే సీక్వెన్స్ లో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా స్పోర్టివ్ గా పాషన్ తో చేశారు. ఇందులో ఆయన పెర్ఫార్మన్స్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది.
సోనాక్షి సిన్హా గారు ఈ కథ విన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు.. ?
-ఈ సినిమా కథ విన్నప్పుడే దీన్ని హిందీలో కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. సోనాక్షి సిన్హా గారు నాకు ముందే తెలుసు. ఆమె అద్భుతమైన పెర్ఫార్మర్.  ధన పిశాచి క్యారెక్టర్ కి సోనాక్షి గారు పర్ఫెక్ట్.  చాలా మెమొరబుల్ క్యారెక్టర్ అవుతుంది. తప్పకుండా ఆడియన్స్ కి గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.  
- సోనాక్షి గారు ఈ సినిమా కోసం చాలా హెవీ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. షూటింగ్ ముందు చాలా ప్రిపరేషన్ ఉండేది. సుధీర్ బాబు గారితో సోనాక్షికి చాలా హెవీ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయి.


కథలో అనంత పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన స్ఫూర్తి ఉందా.. ?
మైథలాజికల్ స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నాగబంధం గురించి తెలిసే ఉంటుంది. నేను పురాణాలని చదువుతాను. శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు ఇష్ట దైవము. పద్మనాభ స్వామి టెంపుల్ ఇన్స్పిరేషన్ ఇందులో ఉంటుంది. ధన పిశాచి కి సంబంధించి ఎలిమెంట్స్ ఆడియన్స్ ని చాలా సర్ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ వున్నాయి.
ట్రైలర్ లో చాలా మంచి విఎఫ్ఎక్స్ వర్క్ కనిపించింది?  సిజీ వర్క్ గురించి.. ?  
ఈ సినిమాల్లో  60% లైవ్ విజువల్స్ ఉంటాయి. కథకు అవసరమైనంత మేరకు 40శాతం విఎఫ్ఎక్స్ వర్క్ వుంటుంది. సిజీ చాలా నేచురల్ గా వచ్చింది. ఆడియన్స్ చాలా నేచురల్ గా ఫీల్ అవుతారు


శిల్పా శిరోద్కర్ గారికి  గురించి.. ?
- శిల్పా శిరోద్కర్ గారు  బిగ్ బాస్ లోకివెళ్లే సమయంలో కలిసాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ గురించి చెప్పాను. తన పెర్ఫార్మన్స్ ఈ సినిమాలోచాలా స్పెషల్ గా ఉండబోతుంది . ఆ క్యారెక్టర్ లో చాలా ఎమోషన్స్ ఉంటాయి.
జటాధరకి పార్ట్ 2 ఉంటుందా.. ?
- కచ్చితంగా. సీక్వెల్ లా  ఫ్రీక్వెలా అని చెప్పలేము గాని ఈ సినిమాకి  కొనసాగింపుగా ఇంకో సినిమా అయితే ఉంటుంది.
- మేము మరో తెలుగు సినిమా కూడా మేము చేయబోతున్నాం. పెద్ద హీరోతో ఆ సినిమా చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలు కూడా తెలియజేస్తాం
- జి స్టూడియోస్ మాకు చాలా మంచి కొలాబరేషన్ ఉంది. నేను చేసిన రుస్తుం నుంచి ఇప్పటివరకు మా జర్నీ చాలా సక్సెస్ఫుల్ సాగుతోంది. ఫ్యూచర్లో తెలుగు నిర్మాణ సంస్థలతో కూడా కలసి సినిమాలు చేయాలని భావిస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: