- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దర్శక ధీరుడు రాజమౌళి రెండు దశాబ్దాల తన కెరీర్లో అసలు అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్నారు. 2001 లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారిన రాజమౌళి తన రెండో సినిమా సింహాద్రి కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే తెర‌కెక్కించారు. తర్వాత జూనియర్ తో మరోసారి ముచ్చటగా యమదొంగ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇక రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. బాహుబలి 2 సినిమాలతో రాజమౌళి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు హీరోతో సంబంధం లేకుండా ఈగ ను పెట్టి ఈగ టైటిల్ తో సినిమా తెరకెక్కించి కూడా రాజమౌళి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. రాజమౌళి అస్సలు అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్నారు.


ఇది ఇలా ఉంటే రాజమౌళి అంటే కొందరికి ఆక్క‌సు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. గతంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం రాజమౌళి సినిమా ప్లాప్ అయితే చూడాలని చాలామందికి ఆశగా ఉందని కామెంట్ చేశారు. తాజాగా వారణాసి సినిమా ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో కొందరు రాజమౌళి కెరీర్ లో వారణాసి తొలి ప్లాప్ వార‌ణాసి అని కామెంట్లు పెడుతున్నారు. అయితే రాజ‌మౌళి . . మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇందుకు కౌంట‌ర్లు ఇస్తున్నారు. అందుకే అతను మిమ్మల్ని వదిలేసి ముందు నేషనల్ ఆడియన్స్ కోసం సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ కోసం తీస్తున్నాడు అని కామెంట్ చేస్తున్నారు. తెలుగు జాతి గురుంచి మాట్లాడేటప్పుడు పీతల కథ గురుంచి చెబుతూ ఉంటారు , ఈ పీత మన బావి దాటకుని ఎప్పుడో వెళ్లిపోయింది .. మీరు అందుకోవాలన్న .. అందుకోలేనంత ఎత్తు లో మా రాజ‌మౌళి ఉన్నాడ‌ని కౌంట‌ర్లు గ‌ట్టిగా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: