బాలకృష్ణ స్టైలిష్ మోడ్రన్ లుక్‌లో డబుల్ రోల్ హావభావాలను పలికిస్తుండగా... అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్! ఊహించని రేంజ్‌లో, సూపర్ గ్లామరస్ అవతార్‌లో బాలయ్య పక్కన నిల్చున్న సంయుక్తను చూసి ఇది పక్కా స్పెషల్ సాంగ్ అని కన్ఫర్మ్ అయింది. బాలయ్య-బోయపాటి ఫార్ములాకు సంయుక్త గ్రేస్, గ్లామర్ కూడా తోడవడంతో... ఈ క్రేజీ మాస్ నంబర్ "జాజికాయ జాజికాయ" పేరుతో రావడం గ్యారంటీ హైలైట్! 'అఖండ 2' టీమ్ సాధారణంగా ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసి వదిలేయడం లేదు. ఈ ఒక్క పాట కోసమే భారీ స్థాయిలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. "జాజికాయ జాజికాయ" లిరికల్ వీడియోను నవంబర్ 18న సాయంత్రం 5 గంటల నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అంతేకాదు.. మాస్ ఆడియన్స్‌కు అడ్డా అయిన వైజాగ్‌లోని ప్రఖ్యాత జగదాంబ థియేటర్‌లో ఈ సాంగ్ లాంచ్‌ను నిర్వహించబోతున్నారు! కేవలం ఒక పాట కోసం ఇలా థియేటర్లో ఈవెంట్ చేస్తున్నారంటే.. ఈ మాస్ బీట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు! మొదటి పాటతో డివోషనల్ పీక్స్‌ను టచ్ చేసిన థమన్.. ఇప్పుడు ఈ పాటతో అసలైన మాస్ బీట్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించబోతున్నాడు. బాలయ్య ఎనర్జీ, సంయుక్త డ్యాన్స్, థమన్ మ్యూజిక్.. ఈ మూడు కలిస్తే థియేటర్లలో రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుండగా.. ఈ "జాజికాయ జాజికాయ" మాస్ నంబర్ యూట్యూబ్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ఈ మాస్ సునామీ ఏ రేంజ్‌లో క్లిక్ అవుతుందో చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి