ప్రస్తుతం తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో ఒక భారీ అప్‌డేట్ జోరుగా వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమాను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు ఆయన మెగాస్టార్ అసలు పేరును టైటిల్‌గా ఫిక్స్ చేయడమే కాకుండా, “మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు” అంటూ ఇచ్చిన క్రేజీ క్యాప్షన్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది.ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో అప్డేట్లు బయటకు వచ్చాయి. అయితే తాజాగా బయటపడిన ఓ న్యూస్ మాత్రం అన్నింటికంటే ఎక్కువ హంగామా క్రియేట్ చేస్తోంది. అందులో భాగంగా, ఈ సినిమాలో చిరంజీవితో పాటు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు వెంకటేష్ మరియు నాగార్జున కూడా ముఖ్యమైన గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


ఇంతటితో ఆగిపోలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్‌లో ఇద్దరు మెగా హీరోలు కలిసి మెరవబోతున్నారని, ఆ సాంగ్ కోసం గ్రాండ్ స్కేల్‌లో సెట్ వేశారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నవారు మాత్రమే కాదు, చాలామందికి సహాయం చేసే మంచి మనసున్న వారు కూడా. ముఖ్యంగా ఈ ఇద్దరితో మెగాస్టార్‌కు ప్రత్యేకమైన అభిమాన సంబంధం ఉన్నట్టు ఇండస్ట్రీలో అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి వల్లే వాళ్ల కెరియర్ ఈ రేంజ్ కి ఎదిగింది. ఆ ఇద్దరు వ్యక్తులే ఇప్పుడు ఆయన సినిమాకే స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అన్న వార్త బయటకు రాగానే, సోషల్ మీడియాలో ఈ న్యూస్ భారీగా వైరల్ అయింది. ఆ ఇద్దరు మరి ఎవరో కాదు..సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ కలయికపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.



అనిల్ రావిపూడి ఈ మొత్తం ఎపిసోడ్‌ను ఫుల్ సర్ప్రైజ్‌గా ప్లాన్ చేశాడనే టాక్ మరింత హైప్ పెంచుతోంది. మొత్తం మీద చిరంజీవి–వెంకటేష్–నాగార్జున లాంటి లెజెండ్స్‌తో పాటు మెగా హీరోల ప్రెజెన్స్ ఉండటంతో, ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా భారీ క్రేజ్ క్రియేట్ చేస్తుందని ఫిలిమ్ నగర్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: