ఇప్పుడంతా ప్రేక్షకులు తమదైన, మనవైన కథల్నే చూడాలని అనుకుంటున్నారని, అందుకే 'పాన్ ఇండియా' పేరుతో కథల్లో, పాత్రల్లో అనవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం లేదని నిర్మాత స్పష్టం చేశారు. వాటిని సహజంగా, అద్భుతంగా తెరపైకి తీసుకొస్తే చాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అఖండ2 మూవీ గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చే మనదైన కథతోనే రూపొందిందని వెల్లడించారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి థియేటర్లలో ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కథను అనుకున్నప్పుడే, ఇది దేశం మొత్తం చూసేలా రూపొందించాల్సిన సినిమా అని నిర్ణయించుకున్నామని తెలిపారు. అంతేకాకుండా, దీనిని పాన్ ఇండియా స్థాయితో పాటు త్రీడీలో కూడా తీయాలని అప్పుడే నిర్ణయించామని వెల్లడించారు.
ఈ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉంటాయని, 2డీలో సినిమాను చూశాక కూడా ప్రేక్షకులు కచ్చితంగా త్రీడీలో చూడాలని అనిపిస్తుందని నిర్మాత చెప్పుకొచ్చారు. మొత్తానికి, అఖండ2 మూవీ అంచనాలను మించి థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అఖండ2 సినిమాపై బాలయ్య సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి