అసలేం జరిగిందంటే.. ధనుష్ ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌కు కారులో చేరుకోగా వెంటనే కెమెరాలు అతనిపై ఫోకస్ పెట్టాయి. అప్పుడే అతని వెనుక నుంచి ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి ధనుష్ ప్యాంట్‌ను సరిచేస్తుంది. ఆ తర్వాత షర్ట్ కాలర్, సైడ్ ఫోల్డ్స్‌ను కూడా సెట్ చేస్తుంది. ధనుష్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ముందుకు వెళ్లిపోయాడు.
ఈ చిన్న క్లిప్ ఆన్లైన్‌కి రాగానే నెటిజన్ల కామెంట్ల మోత మోగించడం స్టార్ట్ చేశారు. “స్టార్ హీరోల ఈగో ఇంత పెరిగిపోయిందా?”, “ప్యాంట్ సరిచేయడానికి కూడా అసిస్టెంటా?” అంటూ చాలామంది సెటైర్లు పేల్చారు. కొందరు ధనుష్ ను దారుణంగా విమర్శిస్తున్నారు కూడా. ఈ విమర్శలు ఎక్కువవుతున్న తరుణంలో ధనుష్ అభిమానులు రంగంలోకి దిగారు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అసిస్టెంట్ కాదని.. ధనుష్ పర్సనల్ స్టైలిస్ట్ కావ్య శ్రీరామ్ అని వారు స్పష్టం చేశారు.
ఫోటోలు, ఈవెంట్లు, వీడియోలలో హీరో లుక్ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవడం స్టైలిస్ట్ పని అని చెప్తూ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ధనుష్ తన టీమ్‌ను ఉద్యోగుల్లా కాదు… స్నేహితుల్లా చూస్తాడంటూ అభిమానులు మరో వీడియోను కూడా షేర్ చేశారు. అందులో ధనుష్, స్టైలిస్ట్ కావ్య, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, నటి కృతి సనన్ కలిసి రిలాక్స్‌గా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కాగా, సెలబ్రిటీ ఈవెంట్లలో స్టైలిస్ట్‌లు లుక్ ఫిక్స్ చేయడం సహజమే. అయితే ఈసారి కెమెరాలో చిక్కిన ఈ చిన్న క్లిప్ వల్ల సోషల్ మీడియాలో పెద్ద కథ పుట్టింది. ధనుష్ మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ అతని ఫ్యాన్స్, స్టైలిస్టు టీమ్ మాత్రం ఈ వివాదానికి తామే ఫుల్ స్టాప్ పెట్టేశారు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి