స్టార్ హీరో మహేష్ బాబు ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని తెలుస్తోంది.  మహేష్ బాబు మల్టీప్లెక్స్  బిజినెస్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు.  జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మహేష్ కు సొంతంగా నిర్మాణ సంస్థ ఉంది.  మహేష్ బాబు వేర్వేరు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.  రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా మహేష్ బాబు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తీ కావడానికి  మరో రెండు సంవత్సరాల సమయం పడుతుందని తెలుస్తోంది.  దర్శకుడు రాజమౌళి  హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తుండగా  ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఆస్తుల విలువ కూడా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, , స్పిరిట్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు.  ఒక్కో సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉన్నా  తన సంపాదనను దాచుకోవడం కంటే కొంత మొత్తాన్ని మంచి పనుల కోసం ఖర్చు చేయడానికి  ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రభాస్  తన సంపాదనను సొంత బ్యానర్ పై  సినిమాలను  నిర్మించడానికి ఖర్చు చేస్తారు.  ప్రభాస్ కు  జూబ్లీహిల్స్‌లోని పాష్ ఏరియాలో విలాసవంతమైన హౌస్ ఉండగా  84 ఎకరాల్లో ఫామ్ హౌస్, ముంబైలో మరో ఇల్లు ప్రభాస్ కు ఉన్నాయని తెలుస్తోంది.  ప్రభాస్ దగ్గర  3.5 కోట్ల విలువైన లంబోర్గిని అవెంటడార్ కారు, 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: