ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఆయనతో సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే స్థాయికి ఆయన బ్రాండ్ చేరిందనే చెప్పాలి.ఇదిలా ఉండగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ ప్లాన్ కూడా జరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌ను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సారి కథలో ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ ఉండబోతుందట. ఆ పాత్ర కోసం మొదట రానా దగ్గుబాటి పేరు వినిపించినప్పటికీ, తాజాగా మరో ఇద్దరు స్టార్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
తమిళ్ స్టార్ హీరో కార్తీ లేదా ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్‌లో ఎవరో ఒకరిని ఈ కీలక పాత్ర కోసం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇన్నాళ్లు వెంకటేష్ పేరు జపం చేశారు అనిల్ రావిపూడి..ఇప్పుడు ఈ హీరోలా..? నీ ప్లాన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం, ఫహాద్ ఫాజిల్‌ను ఫైనల్ చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయట. ఆయన అయితే కథకు మరో స్థాయి తీసుకువస్తాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మొత్తానికి, అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్‌తో పాటు మరో స్టార్ హీరో గెస్ట్ రోల్‌లో కనిపిస్తే, ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి