సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే నెలల తరబడి షూటింగ్ చేయాలి, కోట్లు ఖర్చు పెట్టాలి అనుకుంటారు. కానీ ఈ సినిమా కేవలం 29 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. కేవలం ₹3.25 లక్షల స్వల్ప బడ్జెట్‌తో పాలకొల్లు, భీమవరం పరిసరాల్లో ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాతోనే దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ పరిచయం అయ్యారు. అలాగే ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావు కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు.ఈ సినిమా సాధించిన అసలైన ఘనత దాని రన్నింగ్ టైమ్."ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో ఏకంగా 512 రోజులు ప్రదర్శితమైంది. అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి పైగా హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అయ్యిందంటే చిరంజీవి క్రేజ్ అప్పుడే ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు."
మొదట విడుదలైనప్పుడు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, పక్కింటి వారి కుతంత్రాల చుట్టూ తిరిగే ఈ కథ మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.ఈ సినిమాలో రాజశేఖరంగా చిరంజీవి నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ సినిమా సక్సెస్ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. దీని క్రేజ్ చూసి తమిళం, కన్నడ మరియు హిందీ (ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్ - గోవిందా హీరోగా) భాషల్లో కూడా రీమేక్ చేశారు. చిరంజీవి కెరీర్‌లో 'ఖైదీ' కంటే ముందే ఆయనకు ఒక మాస్ అండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చిన సినిమా ఇదే.
ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు చిరంజీవికి వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. ఒక సాధారణ హీరో నుంచి 'మెగాస్టార్' అయ్యే ప్రయాణంలో ఈ 500 రోజుల రికార్డ్ ఒక గట్టి పునాదిగా నిలిచింది. అందుకే ఇప్పటికీ ఓల్డ్ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా పేరు చెబితే కాలర్ ఎగరేస్తారు.నేటి కాలంలో సినిమా అంటే మొదటి మూడు రోజులు వసూళ్లు రాబట్టి ఆ తర్వాత మాయమైపోవడం కామన్ అయిపోయింది. కానీ 500 రోజులు ఒక సినిమా ఆడిందంటే అది ఆ సినిమాలోని సత్తాకు, చిరంజీవికి ఉన్న తిరుగులేని మాస్ అపీల్‌కు నిదర్శనం. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' ఎప్పటికీ చిరంజీవి కెరీర్‌లో ఒక గోల్డెన్ పేజీగా ఉంటుంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి