‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి ప్రస్తుతం తన కెరీర్‌ను నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో వరుస విజయాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఆమె, ఆ తర్వాత నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంత వెనుకంజ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస బాక్సాఫీస్ పరాజయాలు ఎదురవ్వడంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త అవకాశాల కోసం కోలీవుడ్ వైపు దృష్టి సారించింది.

అయితే అక్కడ కూడా కృతి శెట్టికి అనుకున్నంత అదృష్టం కలిసి రావడం లేదు. ఇటీవల విడుదలైన ‘వావతియార్’ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఆమె కొంత ఆందోళనకు గురవుతోంది. ఈ పరిస్థితుల్లో కృతి శెట్టి ఆశలన్నీ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాపైనే కేంద్రీకృతమయ్యాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తుండగా, ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

వాస్తవానికి ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కృతి శెట్టి కెరీర్‌కు అత్యంత కీలకంగా మారిందనే చెప్పాలి. ఆమె ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఈ సినిమా తప్పకుండా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒకవేళ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతే, తమిళంతో పాటు తెలుగులోనూ కృతి శెట్టికి అవకాశాలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె కెరీర్ ప్రమాదంలో ఉందంటూ పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది.

మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ‘బేబమ్మ’కు మళ్లీ పాత క్రేజ్‌ను తీసుకొస్తుందా? లేక ఆమెను ఇండస్ట్రీకి దూరం చేసే మలుపుగా మారుతుందా? అన్న ప్రశ్నలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ‘వావతియార్’ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం నిరాశ కలిగించింది. అయితే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మాత్రం అలా కాకుండా కృతి శెట్టి అదృష్టాన్ని మార్చి ఘనవిజయం సాధిస్తే, ఆమె క్రేజ్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమా ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: