బాలీవుడ్ లో పలు సీరియల్స్ నటించి, తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల గుండెలలో చరగని ముద్ర సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం అటు తెలుగు, హిందీ వంటి చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో మృణాల్ ఠాగూర్ కూడా హీరోయిన్గా నటించబోతోందనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన అటు చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.



ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బీగి బీగి మ్యూజిక్ వీడియో ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సినిమాలో నటించబోతున్నారా అంటూ విలేకరులు ప్రశ్నించగా అందుకు విభిన్నంగా సమాధానం చెప్పింది మృణాల్ ఠాకూర్. ఈ వార్తలపై నవ్వుతూ సమాధానాన్ని తెలుపుతూ.. అవునా? నిజంగానే నా పేరు వినిపిస్తోందా? నాకైతే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు. కానీ మీరందరూ ప్రార్థించండి అది నిజమైతే మనందరం కలిసి కూడా ఒక పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుందామంటూ సరదాగా సమాధానాన్ని చెప్పుకొచ్చింది.


దీంతో ప్రస్తుతం తాను అల్లు అర్జున్ సినిమాలో నటించలేదంటు పరోక్షంగానే క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. కానీ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని కూడా తెలియజేసినట్టుగా కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే హిందీలో దో దివానే షెహార్ మే చిత్రంలో నటిస్తోంది. తెలుగులో అడవి శేషు నటిస్తున్న డేకాయిట్ చిత్రంతో  పాటుగా మరికొన్ని చిత్రాలలో నటిస్తోంది. అలాగే సీతారామం 2 కూడా మొదలు కాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ సినిమాలో నటించలేదని చెప్పడంతో అభిమానులు మాత్రం ఈ జోడిని స్క్రీన్ పైన కనిపిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: