రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ గా పేరు సంపాదించిన నా అన్వేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను చుట్టేస్తూ తన ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. అంతేకాకుండా అప్పుడప్పుడు సమాజంలో జరిగేటువంటి విషయాల పైన స్పందిస్తూ ఉంటారు. అలాంటి నా అన్వేషణకు ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది. సుమారుగా 1.3 మిలియన్ల (13 లక్షల) ఫాలోవర్స్ ఉన్నటువంటి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ మెటా బ్లాక్ చేసింది.


గతంలో అన్వేష్ తన వీడియోలలో హిందూ దేవుళ్ళ పైన భారత్ పైన చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. దేశ ప్రతిష్టను తక్కువ చేసి అన్వేష్ చేసిన ప్రవర్తన, మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు అంటూ ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి హైదరాబాదులో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫిర్యాదు పైన విచారణ చేపట్టిన పోలీసులు, నా అన్వేష్ పోస్టులు ఇంస్టాగ్రామ్ కమ్యూనిటీ కి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించారంటూ నిర్ధారించారు.


దర్యాప్తులో భాగంగా మొదట అకౌంట్ వివరాలను సేకరించిన పోలీసులు ఆ తర్వాత నా అన్వేష్ కంటెంట్ దేశ సమగ్రతకు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో నా అన్వేష్ సదరు అకౌంట్ పైన చర్యలు తీసుకోవాలని సిసిఎస్ పోలీసులు మెటా ప్రతినిధులకు ఒక లేఖ రాశారు. పోలీసుల నుంచి అందిన ఈ ఆధారాలను పరిశీలించిన ఇంస్టాగ్రామ్ యాజమాన్యం అన్నిటినీ పరిశీలించి నా అన్వేషణ అకౌంట్ ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో అన్వేష్ ప్రొఫైల్ సెర్చ్ చేస్తే ఆయన చేసిన పోస్టులు ఏవి కనిపించవు. గతంలో నా అన్వేష్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా, హిందూ మతం భారతదేశం పైన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యల వల్ల అతని ఫాలోవర్స్ సంఖ్య 1.3 కి తగ్గిపోయింది. మరి ఇంస్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేయడం పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: