స్టోరీ విషయానికి వస్తే:
కృష్ణ (సుహాస్) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడుగా కనిపిస్తారు. చిన్న వయసు నుంచే తండ్రి చేసే బిజినెస్ను టేక్ ఓవర్ చేయాలని ఎన్నో కలలతో ఉంటారు. కృష్ణ తండ్రి రావు బల్వంత్ (వీకే.నరేష్) లాడ్జిని నడుపుతుంటారు. ఒకసారి కృష్ణ తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తుంది. దీంతో వైద్యులు రావు బల్వంత్ ను బిజినెస్ టెన్షన్ నుంచి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. దీంతో తండ్రి చేసే బిజినెస్ తెలియక ఎలాగైనా తన చేతులలోకి ఆ బిజినెస్ ను తీసుకొని లాభాలలో నడిపించాలని కృష్ణ పట్టుబడతారు. అయితే తీరా ఆ బాధ్యతలు తీసుకోవడానికి వెళ్లిన కృష్ణకు తన తండ్రి నడిపేది లాడ్జి అని తెలిసి షాక్ అవుతారు. దీంతో ఈ గొడవలలో మిత్ర (శివాని నాగారం) పాత్ర ఏంటి అసలు వీరికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది సినిమా కథ.
కథనం:
హే బల్వంత్ సినిమా మనం ఎలాంటి సినిమా చూస్తున్నాం అనేది మొదట రెండు నిమిషాలలోనే చూపించేస్తారు డైరెక్టర్. అక్కడి నుంచి స్టోరీస్ సింక్ అయ్యి అంత ట్రావెల్ గా మారుతుంది. ఇందులో ఒకరకమైన అడల్ట్ కామెడీ ఉంటుంది.కానీ ఎక్కడ హద్దులు దాటి మాత్రం చూపించలేదు డైరెక్టర్. ఇక ట్రైలర్, టీజర్లో కేవలం బిజినెస్ అంటూ చూపించిన దాని చుట్టూ అల్లుకునే కామెడీ కూడా బాగా వర్క్ అవుతుంది. మొదటి భాగం హిలేరియస్ కామెడీగా సాగుతుంది. ఎక్కడ కూడా చిన్న బ్రేక్ ఇవ్వకుండా నాన్ స్టాప్ పంచులతో ఉంటుంది. ముఖ్యంగా సుదర్శన్ కామెడీ సీన్స్ పీక్స్ లో ఉంటాయి. చాలాకాలం తర్వాత బాబు మోహన్ కూడా ఇందులో కామెడీతో బాగానే ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఇచ్చిన కామెడీకి రెండవ భాగంలో లేదు. ఇక ఎప్పటిలాగే నరేష్ చేసే కామెడీ సీన్స్ అదిరిపోయాయి. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ కూడా బాగానే వర్క్ అవుట్ అవుతుంది.
నటీనటుల యాక్టింగ్:
సుహాస్ ఎప్పటిలాగే న్యాచురల్ గా ఆకట్టుకున్నారు. తన మార్క్ యాక్టింగ్ తో కృష్ణ పాత్రలో అద్భుతంగా నటించారు. తన గత సినిమాలలో కంటే ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా కమర్షియల్ టైమింగ్ తో అదరగొట్టేశారు. తండ్రిగా సీనియర్ నరేష్ అద్భుతంగా నటించడమే కాకుండా తన కామెడీ టైమింగ్ తో సెటైర్స్ వేస్తే హైలెట్గా నిలిచారు. నరేష్ సురేష్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లు నవ్వులు పూజించేలా ఉంటాయి. శివాని నాగారం తన స్క్రీన్ ప్రజెంటేషన్ తో అద్భుతంగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, సుదర్శన్ తన కామెడీ టైమ్ ఎంత బాగానే ఆకట్టుకున్నారు.
మొత్తానికి హే బల్వంత్ సినిమా డీసెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్..
రేటింగ్:
2.8/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి