ఏంటి అప్పట్లో సుమ భర్త రాజీవ్ కనకాలని అంతమంది ప్రేమించారా.. వారందరికీ రాజీవ్ కనకాల డ్రీమ్ బాయ్ లా ఉండేవారా..ఇంతకీ రాజీవ్ కనకాలని అంతలా ఆరాధించిన ఆ నటీమణులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఈ చానల్స్ ఏవి లేని సమయంలో దూరదర్శన్ ని చాలా మంది చూసేవారు. అయితే అలా దూరదర్శన్ ద్వారా చాలామంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అలా దూరదర్శన్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో రాజీవ్ కనకాల సుమ కనకాల వంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇక దూరదర్శన్ లో చేసే సమయంలోనే రాజీవ్ కనకాల సుమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కారని చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. 

అయితే గతంలో దూరదర్శన్లో వర్క్ చేస్తున్న సమయంలో రాజీవ్ కనకాలని కేవలం సుమ మాత్రమే కాదు మరి కొంతమంది అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇష్టపడ్డారట. ఇక ఈ విషయాన్ని తాజాగా నటి  గాయత్రి భార్గవి బయట పెట్టింది. సీరియల్స్ తో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన గాయత్రి భార్గవి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి గాయత్రి భార్గవి తాజాగా డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు అనే వెబ్ సిరీస్ లో నటించింది. జీ5 లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీమియర్ ఈవెంట్ లో గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. నేను టీవీలో నటించడానికి పనికి వస్తానని గుర్తించింది రాజీవ్ కనకాలనే.నేను కాలేజీలో చదువుతున్న సమయంలో మా కాలేజీకి స్కూటీపై వచ్చి నన్ను నా ఫోటోని చూసి ఈ అమ్మాయి టీవీకి పనికి వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. 

ఆ తర్వాత కొద్ది రోజులకే యాడ్లో నటించే అవకాశం నాకు వచ్చింది. అప్పటినుండి రాజీవ్ కనకాల నాకు తెలుసు. అలా ఫస్ట్ టైం రాజీవ్ పై క్రష్ పెంచుకున్నాను. నేనే కాదు దూరదర్శన్ లో పనిచేసే మా టీమ్ అందరికీ కూడా రాజీవ్ కనకాలనే ఫస్ట్ క్రష్.. అందుకే మేము రాజీవ్ కనకాలని అన్నా అని పిలవం. సుమా అక్క రాజీవ్ బావ అని పిలుస్తాం అంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకొని నవ్వులు పుట్టించింది నటి గాయత్రి భార్గవి. ప్రస్తుతం నటి గాయత్రి భార్గవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ గాయత్రి మాటలకు యాంకర్ సుమక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: