జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున ఈ ఉత్కంఠకు తెరపడింది. శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతం అయ్యిందని వైద్యులు కూడా తెలియజేశారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి ,ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఈ ఆపరేషన్ చేయించుకున్నట్లు సమాచారం.



ఇటీవల శుక్రవారం రోజున అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒకసారిగా తీవ్ర అస్వస్థకు గురయ్యారని దీంతో అధికారిక పర్యటనలను కూడా రద్దు చేసుకొని వెంటనే ఆసుపత్రిలోకి చేరారు. వైద్యులు ఎంఆర్ఐ ఇతర పరీక్షలు నిర్వహించగా చిన్నపాటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారట. శనివారం సాయంత్రం వైద్య నిపుణుల సంరక్షణ ఈ ఆపరేషన్ పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ ని వైద్యులు 10 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని జనసేన పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.


మరో రెండు మూడు రోజులలో పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ జరిగిందని అభిమానులకు తెలియగానే సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు సిని సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు .పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో తన తదుపరి సినిమాలో ఎంపిక విషయంలో అధికారికంగా పవన్ కళ్యాణ్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఓజి 2 సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: