టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాల విషయంలో అటు పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని సందర్భాలలో ట్రోల్స్ సెలబ్రెటీలు ఎదుర్కొంటూ ఉంటారు. అనుష్క పెళ్లి గురించి ఎప్పటికప్పుడు నిరంతరం ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ఒక స్టార్ హీరోతో పెళ్లి అంటూ, మరికొన్నిసార్లు ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపించాయి.


ఇటీవల అనుష్క ఒక వ్యక్తి చేయి పట్టుకొని మరీ నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనుష్క ఎంగేజ్మెంట్ ఫోటో అంటూ ప్రచారం జరుగుతోంది. మరొకసారి అనుష్క పెళ్లి వార్తలు జోరుగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోని చూసిన చాలామంది అనుష్క ని ట్రోల్ చేస్తున్నారు. అయితే అనుష్క చేయి పట్టుకొని నడిచిన వ్యక్తికి సంబంధించి ఆ ఫోటో 2016లో జరిగిన ఒక ఫ్యాషన్ షో అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలియక చాలామంది ఆ ఫోటోని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సమాచారం.


ఇన్ని రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ అనుష్క మాత్రం తన పెళ్లి గురించి ఎక్కడ ఏ ఒక్క విషయంపై కూడా స్పందించలేదు. ఈ విషయం పైన అభిమానులు కూడా నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం అనుష్క తన తదుపరి ప్రాజెక్టుల విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా పేరు సంపాదించిన అనుష్క మళ్ళీ అదే స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇటీవల విడుదలైన ఘాటి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. మరి తన తదుపరి సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి మరి. ఏది ఏమైనప్పటికీ అనుష్క పెళ్లి రూమర్స్ తో మరొకసారి వార్తలలో నిలుస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: