పలువురు సినీ ప్రముఖులు రాజకీయ వేతలు కూడా ప్రకాష్ రాజ్ తల్లి మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ తల్లీ మరణానికి సంతాపం తెలియజేశారు. నటుడు శ్రీ ప్రకాష్ రాజు గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించి ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకాష్ రాజ్ సినీ కెరియర్ విషయానికి వస్తే 1988లో మొదటిసారిగా తన సిని కెరియర్ని మొదలుపెట్టిన ప్రకాష్ రాజ్ తెలుగులో సంకల్పం అనే సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఎన్నో వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే.. జననాయగన్, గూడచారి 2, వారణాసి, డేకాయిట్, స్పిరిట్, మిరాకిల్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అలాగే కన్నడలో కూడా రెండు మూడు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి