బన్నీ బర్త్‌డే రోజున ఎలాంటి విజువల్ ట్రీట్ ఉండబోవట్లేదని బన్నీ వాసు స్పష్టం చేశారు."నాకు తెలిసినంత వరకు బన్నీ పుట్టినరోజున ఎలాంటి వీడియో కంటెంట్ విడుదల చేసే ఆలోచన చిత్ర యూనిట్‌కు లేదు. ఈసారి టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుంది" అని వెల్లడించారు.ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో, మేకర్స్ ఎక్కడా తొందరపడదలచుకోలేదు. ఇప్పుడే విజువల్స్ బయటకు వస్తే సినిమాపై ఉన్న ఉత్సుకత తగ్గిపోవచ్చని భావించి, కేవలం టైటిల్ మరియు పోస్టర్‌తోనే ‘హైప్’ క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న మరో హాట్ టాపిక్ అయితే కాస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తున్నట్లు సమాచారం.జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ మరియు రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 8న వచ్చే పోస్టర్ ద్వారా ఈ అంశాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు సైన్స్ ఫిక్షన్ జోనర్ తోడవ్వడంతో, ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మొత్తానికి ఈసారి బన్నీ బర్త్ డే సందర్భంగా వీడియో అప్డేట్ లేకపోయినా, టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి