ఇక చిత్ర యూనిట్ విడుదల చేసిన “ఇక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు” అనే క్యాప్షన్‌తో కూడిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో హీరో యొక్క పవర్‌ఫుల్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ప్రతి విషయంలాగే, దీనిపై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది నెటిజన్లు ప్రభాస్ తీసుకున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ట్రోల్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
“తన సినిమాల ప్రమోషన్స్‌కి కూడా ఇంతగా స్పందించరు, కానీ ఇతరుల సినిమాల కోసం ఇంతగా ముందుకు వస్తున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రభాస్ చూపిన ఈ సపోర్ట్ ఇండస్ట్రీలో సహకార భావనకు నిదర్శనంగా నిలుస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ‘బైకర్’ సినిమా ప్రమోషన్స్‌కి ప్రభాస్ రావడం వల్ల చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కొంతమంది ఫ్యాన్స్ దీని పట్ల రియాక్ట్ అవుతున్నారు. ప్రభాస్ మంచి పని చేసిన కూడా తప్పు పడతారా..? అంటూ ఫైర్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి